నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
జగిత్యాల జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని, మిల్లింగ్, రవాణా, గిడ్డంగులలో ఉన్న సమస్యలను తొలగించాలని కోరుతూ కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతిరెడ్డి లా ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు వరి పంట ఎక్కువ పండించారు.దానిని పెద్ద మొత్తంలో ప్రభుత్వం కొనుగోలు చేసింది.అయితే కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి (సి ఎం ఆర్) భారత ఆహార సంస్థ నిర్దిష్టమైన గడువు లోపల పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉంది.అయితే గత మూడు సంవత్సరాల కాలంలో భారత ఆహార సంస్థకు సరఫరా చేయాల్సిన సిఎంఆర్ లక్ష్యం పూర్తిగా చేరలేదు.కావున ఇప్పటివరకు సరఫరా చేసిన ధాన్యం ఎంత..? ఇంకా రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులలో పెండింగ్లో ఉన్న ధాన్యం నిల్వలు ఎన్ని..? పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలి..మిల్లింగ్, రవాణా, గిడ్డంగులలో ఉన్న సమస్యలను తొలగించాలి.కస్టర్డ్ మిల్లింగ్ రైస్ కేంద్ర ప్రభుత్వానికి చేరవేయడంలో జరుగుతున్న జాప్యం వలన రాష్ట్ర ప్రభుత్వంపై అదనకు ఆర్థిక భారం పడుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన శ్వేతా పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గత మూడు సంవత్సరాల నుండి ఎఫ్ సి ఐ కి బకాయిగా ఉన్నారని మిల్లర్ల నుండి వెంటనే బియ్యాన్ని సేకరించి ఎఫ్ సి ఐ కి ఇవ్వాలని తాలూ తప్ప పేరుతో రైతుల పొట్ట కొడుతున్నారని వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారుఈ కార్యక్రమంలో బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, కోరుట్ల రూరల్ అధ్యక్షులు పంచరీ విజయ్, బిజెపి ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, విట్టల్, రాజేందర్ రెడ్డి, కోరుట్ల మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు రాజు పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మామిడి మల్లేశం మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.
Telangana
*పెండింగ్లో ఉన్న సీఎంఆర్ ను యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలి..* *మిల్లింగ్, రవాణా, గిడ్డంగులలో ఉన్న సమస్యలను తొలగించాలి..* *కిసాన్ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడిపల్లి గోపాల్ రెడ్డి* ---------------------------------------
Quick Summary:
మిల్లింగ్, రవాణా, గిడ్డంగులలో ఉన్న సమస్యలను తొలగించాలి..*