నేటి సాక్షి, కొమరం భీమ్ ఆసిఫాబాద్ టౌన్: ఆసిఫాబాద్ పట్టణంలోని బజార్‌వాడి రేషన్ షాపులో లబ్ధిదారులకు శుక్రవారం మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎం.డి. అహ్మద్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎం.డి. అహ్మద్ మాట్లాడుతూ.. రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం మరింత సులభంగా, పారదర్శకంగా సేవలు అందించేందుకు స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులందరికీ స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తున్నామని చెప్పారు.
ఇప్పటికీ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోని లబ్ధిదారులు వెంటనే తమ పరిధిలోని రేషన్ డీలర్‌ను సంప్రదించి కార్డులను పొందాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది రామారావు, రేషన్ డీలర్ అమన్, బీఆర్‌ఎస్ నాయకులు షబ్బీర్, షాకీర్, వార్డు మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.
[21/08, 7:45 pm] Manda Laxman Miryalaguda: గంజాయి మత్తులో టీచర్ హత్య కేసుతో రాష్ట్ర ప్రజలలో భయం...
—డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
-సమగ్ర విచారణ జరిపి నిందితులకు కఠిన చర్యలు శిక్ష విధించాలి
-బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి
కత్తుల కాన్షీరామ్
నేటిసాక్షి, నల్లగొండ : దేవరకొండ నియోజకవర్గంలో ఇటివల
కొండమల్లేపల్లిలో 10వ తరగతి విద్యార్థులు గంజాయి మత్తులో హైస్కూల్
ప్రధానోపాధ్యాయురాలు రూపారెడ్డి పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసి, చంపినట్లు వెలువడుతున్న వార్తలు అత్యంత ఆందోళనకరమైనవని బిఎస్పీ పార్టీ
భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి కత్తుల కాన్షీరామ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కత్తుల కాన్షీరామ్ మాట్లాడుతూ, ఈ ఘటనను బహుజన సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఉపాధ్యాయురాలిపై ఇంత దారుణమైన దాడి జరిగే పరిస్థితి ఏర్పడిందంటే, ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా చూడటం సరికాదని, ఇది రాష్ట్రంలో డ్రగ్స్ వ్యాప్తి, యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం, పాఠశాలల భద్రతపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాల్సిన తీవ్రమైన సామాజిక సమస్య అని, విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు, పెన్నులు ఉండాల్సిన వయసులో గంజాయి, కత్తులు ఎలా చేరుతున్నాయని,
పాఠశాలలు, కళాశాలల చుట్టుపక్కల మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిపై నిఘా ఎక్కడ ఉందని, విద్యార్థులకు గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తులు, ముఠాలు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? చిన్న వయస్సు పిల్లలకు డ్రగ్స్ చేరుతున్నా సంబంధిత వ్యవస్థలు ఎందుకు ముందుగానే గుర్తించలేకపోతున్నాయి అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేవలం “డ్రగ్స్‌పై ఉక్కుపాదం” అంటూ ప్రకటనలు చేయడం కాదని, క్షేత్రస్థాయిలో ఫలితాలు చూపించాలని, ప్రతి పాఠశాల, కళాశాల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, డ్రగ్స్ సరఫరా చేసే నెట్‌వర్క్‌ను గుర్తించి మూలాలతో సహా కట్టడి చేయాలని,
అదేవిధంగా ఈ ఘటనపై పక్షపాతం లేకుండా సమగ్ర దర్యాప్తు జరిపి, అసలు కారణాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. నిందితులు ఎవరైనా, ఎంతటి ప్రభావం ఉన్నవారైనా చట్టం ముందు నిలబెట్టి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Telangana
[21/08, 7:39 pm] Mohammad Mobin. Asifabad: లబ్ధిదారులంతా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకోవాలి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎం.డి. అహ్మద్
Quick Summary:
డ్రగ్స్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం