ఆగస్టు 21పాములపాడు:-
భారత ఎన్నికల సంఘం (ఈసిఐ) మార్గదర్శకాల మేరకు, 01.07.2026ను అర్హత తేదీగా నిర్ణయించి రాష్ట్రంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ ఐ ఆర్-2026)లో భాగంగా, 31.07.2026 నుండి 30.08.2026 వరకు క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్న నేపథ్యంలో, ఆగస్టు-22, 23, 29 మరియు 30 తేదీలలో (శనివారాలు, ఆదివారాలు) పాములపాడు మండలంలోని, అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు ఏఈఆర్ఓ/ తహసిల్దార్ జి.సుభద్రమ్మ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ జి.సుభద్రమ్మ మాట్లాడుతూ ప్రత్యేక ప్రచార దినాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో సంబంధిత బూత్ లెవల్ అధికారి (బి ఎల్ ఓ) ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. బిఎల్ఓ లు తమ వద్ద ఉన్న ఫారం-6, ఫారం-7, ఫారం-8, ఫారం-8ఏ, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా మరియు ఏఎస్ డిడి జాబితా తదితర వివరాలతో పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సందేహాలను నివృత్తి చేయడంతో పాటు, అవసరమైన సమాచారాన్ని అందిస్తారనీ అన్నారు.
డ్రాప్ట్ ఓటర్ల జాబితాలో పేరు లేని, అర్హత కలిగిన వ్యక్తులు ఈ ప్రత్యేక ప్రచార దినాల్లో ఫారం-6 ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చు అని అన్నారు. అలాగే, ఓటర్ల జాబితాలో పేర్లు / వివరాలకు సంబంధించిన అభ్యంతరాలు ఉన్నవారు ఫారం-7 ద్వారా, వివరాల్లో మార్పులు లేదా సవరణలు అవసరమైన వారు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా 18-19 సంవత్సరాల వయస్సు కలిగిన యువ ఓటర్లు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేలా ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సూచించారు.
Andhra
*18 సంవత్సరాలు నిండిన యువతి,యువకులు ఓటు హక్కుకు నమోదు చేసుకోండి:-జి.సుభద్రమ్మ (తహసిల్దార్)*
Quick Summary:
ఆగస్టు 21పాములపాడు:-