నేటి సాక్షి ఆగస్టు 17 పాములపాడు :-
మండల కేంద్రమైన పాములపాడులోని, ఎస్సీ బాలికల వసతి గృహంలో గడివేముల మండలంలోని, బిలకలగూడూరు గ్రామానికి చెందిన మాధవరం చైతన్య ఉండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో 555 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు ఎస్సై పి.తిరుపాలు 10వేల రూపాయల నగదు బహుమతిని పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా పాములపాడు మండలం సబ్ ఇన్స్పెక్టర్ పి.తిరుపాలు మాట్లాడుతూ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఉండి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్ధినులకు గతంలో నగదు బహుమతినీ నేను ప్రధానం చేస్తానని ప్రకటించడం జరిగిందన్నారు. నేను చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు గడివేముల మండలంలోని, బిలకలగూడూరు గ్రామానికి చెందిన మాధవరం చైతన్య కి ఈ రోజు 80 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా హాస్టల్ వార్డెన్ డి.అనిత విజయ కుమారి సమక్షంలో 10వేల రూపాయలు నగదు బహుమతి ప్రధానం చేయడం జరిగింది. కనుక పేదవిద్యార్థుల చదువు కోసం ప్రతి ఒక్కరు చేయూత ను అందించి, వారి భవిష్యత్ కు పునాదిరాళ్లు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆడపిల్లలకు చదువుతో పని లేకుండా తల్లిదండ్రులు ఎక్కువ శాతం పెళ్ళిళ్ళు చేస్తుంటారు . ఇప్పుడు ఉన్న రోజుల్లో అమ్మాయి లకు ముఖ్యంగా మహిళలకు చేసుకోవాలని చదువుకుంటే రేపు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎంతో ఉపయోగ పడుతుంది.బాల బాలికలు చదువుకుంటే తమ ఉపాధ్యాయులకు మరియు రాష్టానికి దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని వారి మహిళలకు ఈ రోజుల్లో చాలా రంగాల్లో ముందంజ గా విజయాలు సాధిస్తున్నారు.కాబట్టి చైతన్య విద్యార్థి కి పట్ల అమ్మాయికి తగిన విధంగాపై చదువులు చదువుకొని సూచనలు ఇచ్చారు ఒక ఉన్నత స్థాయిలో కి చేరాలని శిఖరాలను చేరుకోవాలని మీ తల్లి తండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలుతీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఎస్ ఐ పి తిరుపాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు షేక్షావలి, ఎం.వి.రమణ, తదితరులు పాల్గొనడం జరిగింది.
Andhra
*10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన చైతన్య కి 10వేలు నగదు బహుమతి అందించిన ఎస్సై పి.తిరుపాలు* విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎస్సై , పి. తిరుపాలు. పోలీస్ శాఖలో ఎస్సై,పి. తిరుపాలు మానవత్వాని చాటుకున్న ఎస్సై, సేవలు అభినందనీయం,
Quick Summary:
పోలీస్ శాఖలో ఎస్సై,పి. తిరుపాలు మానవత్వాని

