నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పరిషత్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు,తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శప్రాయమని చిలుకూరు ఎంపిడివో ముక్కపాటి నరసింహారావు అన్నారు. గురువారం ఎంపిడివో కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపిడివో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆయన చేసిన పరిశోధనలు, ఉద్యమం, త్యాగం చిరస్మరణీయమని, సమాజ అభివృద్ధి కోసం విద్య, సామాజిక చైతన్యం, ప్రజాసంక్షేమం ఎంతో కీలకమని ఆయన బోధించిన విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి, విద్యా విస్తరణ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన వంటి అంశాలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో సేవలందిస్తూ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నిబద్ధతతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ ముక్కపాటి నరసింహారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
**ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శం**
Quick Summary:
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పరిషత్