Telangana
కష్టపడి చదివి... విజేతలుగా ఎదగాలి -"శ్రీ సరస్వతి శిశు మందిర్" పాఠశాలలకు నోటు పుస్తకాలను అందించిన...చెర్రీ ఫౌండేషన్ సభ్యులు
Quick Summary:
కష్టపడి చదివి... విజేతలుగా ఎదగాలి
నేటిసాక్షి, మిర్యాలగూడ : విద్యార్థులు ఇష్టంతో చదువుకుంటూ, ఉన్నత స్థానాలను అధిరోహించాలని, అవాంతరాలు ఎన్ని ఎదురైనా, వాటిని ఇష్టంగా భరించి, విజేతలుగా ఎదగాలని చెర్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు చెరి పల్లి అశ్విన్ తెలిపారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 'శ్రీ సరస్వతి శిశు మందిరంలో' చదువుకుంటున్న 200 మంది విద్యార్థులకు రూ. 80 వేలు విలువ చేసే 15 వందల నోటు పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను ఉన్నతమైన ఆశయాలు, కల పౌరులుగా తీర్చిదిద్దే సరస్వతీ శిశు మందిరాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో తమ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే గట్టుప్పల్, కంది పాఠశాలలకు సైతం సుమారు 4వేల నోటు పుస్తకాలను అందించామన్నారు. ప్రతి ఏడాది తమ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలతో పాటు సరస్వతి శిశు మందిరాలను సైతం అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు చేయూతనిస్తామన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెన్నూరి రవికుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ దాతలు అందించే సహకారాన్ని సద్వినియోగం చేసుకొని చక్కగా చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చెర్రీ ఫౌండేషన్ సభ్యులు నరేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.