నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ 650వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సమరసత సంకల్ప్ అభియాన్’లో భాగంగా చేపట్టనున్న ‘కలశ్ వందన్ అభియాన్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ పిలుపునిచ్చారు.జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ‘కలశ్ వందన్ అభియాన్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు.
*రాచకొండ యాదగిరి బాబు మాట్లాడుతూ*
సంత్ శిరోమణి రవిదాస్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకమని, కుల, వర్గ భేదాలకు అతీతంగా సమాజంలో ఐక్యత, సోదరభావం, సామరస్యాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమని అన్నారు. రవిదాస్ మహారాజ్ చూపిన సమరసత మార్గాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
*నారపాక అశోక్ మాట్లాడుతూ*
కాశీలోని సంత్ రవిదాస్ మహారాజ్ జన్మస్థల పవిత్ర క్షేత్రం నుంచి సేకరించిన మట్టితో పూజించిన పవిత్ర కలశాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు తెలిపారు. తెలంగాణకు చేరిన పవిత్ర కలశాన్ని రాష్ట్రంలోని 33 జిల్లాలకు తీసుకెళ్లి, ప్రతి ప్రాంతానికి సంత్ రవిదాస్ మహారాజ్ సందేశాన్ని చేరవేసేలా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ నెల 23న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో తెలంగాణలోని 33 జిల్లాలకు పవిత్ర కలశాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు, పార్టీ పదాధికారులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.జగిత్యాల జిల్లా నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివచ్చి ‘కలశ్ వందన్ అభియాన్’ను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి శ్రీనివాస్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, సమరసత సంకల్ప్ అభియాన్ జిల్లా కో-కన్వీనర్ సింగం పద్మ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మర్రిపల్లి సత్యం, జిల్లా కార్యాలయ కార్యదర్శి జుంబర్తి దివాకర్, సీనియర్ నాయకులు కస్తూరి సత్యం, ఎస్సీ మోర్చా నాయకులు నక్క జీవన్, ఎర్ర రాజు, తడగొండ అంజయ్య, కొత్తూరు బాబు, దుర్గం రమేష్, కొత్తూరు అంజి, అంకమల్ల అనిల్, బెత్తెపు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
Telangana
*కలశ్ వందన్ అభియాన్‌ను విజయవంతం చేయాలి* *బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు* *జగిత్యాల జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలి* *బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్* ----------------------------------------
Quick Summary:
బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్* -----------------------------------