నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
............................................
భక్తి, శక్తి, సేవా స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి పవిత్ర దేవస్థానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆయన మొక్కులు చెల్లించి, రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, తెలంగాణ సర్వతోముఖ అభివృద్ధి, అన్నదాతలకు సమృద్ధిగా పంటలు పండాలని స్వామివారిని వేడుకున్నారు.
*ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ*
"ధర్మానికి ప్రతీకగా, అచంచలమైన భక్తికి మారుపేరుగా నిలిచిన ఆంజనేయ స్వామి మనందరికీ ఆదర్శమన్నారు.
ఆయన నిస్వార్థ సేవా స్ఫూర్తిని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు
హనుమంతుని ఆశీస్సులతోనే ప్రజాసేవలో మరింత నిబద్ధత, చిత్తశుద్ధితో ముందుకు సాగుతానని,రాష్ట్ర ప్రజల సంక్షేమే మా ప్రభుత్వ ధ్యేయమని శ్రీనివాస్ తెలిపారు.
"కొండగట్టు స్వామివారి కృప వల్ల తెలంగాణ శాంతియుతంగా, సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని విప్ శ్రీనివాస్ అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Telangana
*నిస్వార్థ సేవా స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి* *ధర్మానికి ప్రతీక హనుమంతుని ఆశీస్సులు కోరిన విప్* *కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్* --------------------------------------------
Quick Summary:
*నిస్వార్థ సేవా స్ఫూర్తితోనే రాష్ట్ర అభివృద్ధి*
