*నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో ( రాధారపు నర్సయ్య )*
జగిత్యాల జిల్లా పోలీసు శాఖలో కీలక స్థానాల్లో పనిచేస్తున్న ముగ్గురు సబ్ ఇన్‌స్పెక్టర్లకు పరిపాలనా బదిలీలు జరిగాయి. జోన్–2 బాసర డీఐజీ కార్యాలయం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా స్థాయి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే రిలీవ్ అయి కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశించారు.
*కోరుట్ల ఎస్సై–1గా శ్యాంరాజ్ నియామకం*
జగిత్యాల జిల్లా వీఆర్‌లో ఉన్న జి. శ్యాంరాజ్‌ను కోరుట్ల పోలీస్ స్టేషన్‌కు ఎస్సై–1 (ఎస్‌హెచ్‌ఓ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కోరుట్ల పోలీస్ స్టేషన్‌లో కీలక బాధ్యతలు చేపట్టనున్న ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
*ధర్మపురికి సదాకర్.. వీఆర్‌కు మహేష్*
జగిత్యాల జిల్లా డీసీఆర్‌బీలో విధులు నిర్వహిస్తున్న ఎన్. సదాకర్‌ను ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు ఎస్సై–1 (ఎస్‌హెచ్‌ఓ)గా నియమించారు. ప్రస్తుతం ధర్మపురి పోలీస్ స్టేషన్‌లో ఎస్సై–1గా పనిచేస్తున్న మహేష్ ను జిల్లా వీఆర్ కు బదిలీ చేశారు.
*రిలీవ్, జాయినింగ్ వివరాలు పంపాలని ఆదేశాలు*
కోరుట్ల..ధర్మపురి సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా డీఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సంబంధిత అధికారులను వెంటనే రిలీవ్ చేసి, వారు విధుల్లో చేరిన తేదీల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి పంపించాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు డి.ఓ. నెం. 640/2026, సి.నెం. A1/Estt/731/2026, తేదీ 05-08-2026తో జిల్లా పోలీసు కార్యాలయం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
*పరిపాలనా కారణాలతో బదిలీలు*
జోన్–2 బాసర డీఐజీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులను అనుసరించి పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు జిల్లా పోలీసు శాఖ పేర్కొంది. తాజా బదిలీలతో కోరుట్ల, ధర్మపురి పోలీస్ స్టేషన్లలో కొత్త ఎస్సైలు బాధ్యతలు చేపట్టనుండగా, జిల్లా పోలీసు శాఖలో పరిపాలనా మార్పులు చోటుచేసుకున్నాయి.
________________
Telangana
*కోరుట్లకు శ్యాంరాజ్.. ధర్మపురికి సదాకర్* ------------------------- * జగిత్యాల జిల్లాలో ముగ్గురు ఎస్సైల బదిలీలు * జోన్–2 బాసర డీఐజీ ఉత్తర్వుల మేరకు పరిపాలనా బదిలీలు * తక్షణమే విధుల్లో చేరాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు -------------
Quick Summary:
* తక్షణమే విధుల్లో చేరాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలు ----------

