నేటి సాక్షి ఆగస్టు 12
కౌతాళం మండలం కామవరము అమరావతి ఛాంపియన్‌షిప్ అండర్-23 ఖో-ఖో విభాగంలో కామవరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కె. నాగేష్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఆగస్టు 11న కర్నూలు జిల్లా ఔట్‌డోర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా జట్టు ఎంపిక పోటీల్లో నాగేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు.
దీంతో ఈ నెల 27 నుంచి 29 వరకు గుంటూరు జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు కర్నూలు జిల్లా జట్టు తరఫున పాల్గొనే అవకాశం నాగేష్‌కు లభించింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షేక్ గౌసియా బేగం, ఫిజికల్ డైరెక్టర్ బి. శ్రీరాముడు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు విద్యార్థి నాగేష్‌ను అభినందించి, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు.
Andhra
రాష్ట్ర స్థాయిలో మెరిసిన కామవరము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి _ రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు కె.నాగేష్ ఎంపిక
Quick Summary:
_ రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలకు కె.నాగేష్ ఎంపిక